పవన్ పంచ్‌లకు వైసీపీ రివర్స్ పంచ్‌లు!
- ఇప్పటంలో జనసేన ఆవిర్భావ వేడుకలు
- సీఎం క్యాంపు కార్యాలయానికి కూత వేటు దూరంలో సభ
- వేదికపై నుంచి పవన్ పంచ్‌లు
- వాటికి రివర్స్ పంచ్‌లు సంధిస్తున్న వైసీపీ
ఏపీలో రాజకీయ పార్టీల మధ్య ఫటాఫట్ పంచ్‌లు పేలుతున్నాయి. జనసేన ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి కూత వేటు దూరంలోనే బహిరంగ సభను ఏర్పాటు చేసిన జనసేనాని.. అధికార వైసీపీపై పవర్ ఫుల్ పంచ్‌లు సంధిస్తున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిందో, ఏమో తెలియదు గానీ.. వైసీపీ కూడా తన డిజిటల్ టీమ్‌ను రంగంలోకి దించేసింది. అక్కడ ఇప్పటంలో పవన్ పంచ్‌లు సంధించడమే తరువాయి.. వైసీపీ నుంచి కూడా రివర్స్ పంచ్‌లు పడేలా అధికార పార్టీ ప్లాన్ చేసినట్టుంది.
రాష్ట్రంలో పింఛన్లను ఎందుకు తగ్గించారంటూ పవన్ ప్రశ్నించగా.. అప్పటికే రంగంలోకి దిగి రెడీగా ఉన్న వైసీపీ డిజిటల్ మీడియా..రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య ఏమీ తగ్గలేదని ట్విట్టర్ వేదికగా రివర్స్ పంచ్ సంధించింది. చంద్రబాబు అధికారంలో ఉండగా 39 లక్షల పింఛన్లు ఉంటే.. ఇప్పుడు తమ ప్రభుత్వంలో వాటి సంఖ్య ఏకంగా 61 లక్షలకు చేరిందని ట్వీట్ చేసింది. అంతేకాకుండా జనసేన ఆవిర్భావ వేడుకలను ఎద్దేవా చేస్తూ, '8 ఇయర్స్ ఆఫ్ బానిససేన' అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా వదిలింది.