'వీరమల్లు' కొత్త షెడ్యూల్ మళ్లీ వాయిదా?

  • 'వీరమల్లు'గా పవన్ కల్యాణ్ 
  • మొగల్ కాలంలో నడిచే కథ 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • ఏప్రిల్ రెండో వారం నుంచి నెక్స్ట్ షెడ్యూల్
పవన్ కల్యాణ్ తన కెరియర్లోనే మొదటిసారిగా చారిత్రక నేపథ్యంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో కూడిన కథలను తెరకెక్కించడంలో క్రిష్ కి మంచి అనుభవం ఉంది. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' .. 'మణికర్ణిక' సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. 

నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుంది. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్లు వేశారు. 50 శాతం చిత్రీకరణ పూర్తయిన తరువాత కరోనా ప్రభావం వలన షూటింగును వాయిదా వేశారు. మధ్యలో ఒకటి రెండు సార్లు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి ట్రై చేసినా కుదరలేదు. 

దాంతో 'భీమ్లా నాయక్' విడుదల తరువాత ఈ సినిమాపై దృష్టి పెట్టాలని పవన్ భావించారు. అలా ఈ నెల 18వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ ను మొదలుపెట్టాలనుకున్నారు. కానీ మళ్లీ వాయిదా పడినట్టుగా సమాచారం. ఏప్రిల్ రెండవ వారం నుంచి షూటింగుకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.  


More Telugu News