జ‌గ‌న్‌తో ఎస్ఎస్ రాజ‌మౌళి భేటీ.. ఏమేం చ‌ర్చించారంటే..!

  • జ‌గ‌న్‌తో భేటీ కోసం బెజ‌వాడ‌కు రాజ‌మౌళి
  • అసెంబ్లీ స‌మావేశాల కార‌ణంగా ఆల‌స్యంగా భేటీ
  • జ‌గ‌న్‌, పేర్ని నానిల‌తో రాజ‌మౌళి, దాన‌య్య చ‌ర్చ‌లు
  • ఆర్ఆర్ఆర్ సినిమా చుట్టూనే చ‌ర్చ‌
టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో కాసేప‌టి క్రితం ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. జ‌గ‌న్‌తో భేటీ కోసం సోమ‌వారం ఉద‌యం ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్య‌తో క‌లిసి రాజ‌మౌళి హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ చేరుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నందున సీఎం జ‌గ‌న్ కోసం రాజ‌మౌళి ఒకింత వెయిట్ చేయాల్సి వ‌చ్చింది.

తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన భేటీలో సీఎం జ‌గ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నానిల‌తో రాజ‌మౌళి, దాన‌య్య భేటీ అయ్యారు. త్వ‌ర‌లో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఈ భేటీలో చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధ‌ర‌లు, బెనిఫిట్ షో త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


More Telugu News