కరోనా ఎఫెక్ట్!.. చైనాకు యాపిల్ భారీ షాక్|
- చైనాలో రోజువారీ కరోనా కేసుల పెరుగుదల
- పలు నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తూ చైనా నిర్ణయం
- షెన్‌జెన్‌లోని ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేసిన యాపిల్
ఓ వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై పలు పాశ్చాత్య దేశాలతో పాటు టెక్ దిగ్గజాలు ఆంక్షలు విధిస్తూ సాగుతుంటే.. కరోనా వైరస్ విస్తరణ కారణంగా చైనా కూడా ఆ తరహా ఆంక్షలనే ఎదుర్కుంటోంది. కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని ప్రపంచ దేశాలన్నీ కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో కరోనాకు పుట్టిల్లుగా ఇప్పటికే అప్రతిష్ఠ మూటగట్టుకున్న చైనాలో మరోమారు కరోనా వైరస్ తన విస్తరణను ప్రారంభించింది. దక్షిణ చైనాలోని పలు నగరాల్లో రోజువారీగా కరోనా కొత్త కేసులు నమోదవున్నాయి.
ఈ క్రమంలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ను విధిస్తూ చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ అన్న మాట విన్నంతనే టెక్ దిగ్గజం యాపిల్ ఉలిక్కిపడింది. చైనా నగరం షెన్‌జెన్‌లోని తన ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తూ యాపిల్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దక్షిణ చైనాలో షెన్‌జెన్ సిటీ టెక్ హబ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే యాపిల్ సంస్థ చైనా షెన్‌జెన్‌కు చెందిన ఫాక్స్ కాన్తో ఐఫోన్‌కు అవసరమయ్యే విడిభాగాలను తయారు చేస్తుంది. ఆ సంస్థ ఉత్పత్తిలో ఎక్కువ భాగం సెంట్రల్ చైనీస్ నగరం జెంగ్‌జౌలోని ఒక ప్లాంట్ నుంచి చేస్తుంది. అయితే తాజాగా కరోనా కేసులు పెరగడంతో ఐఫోన్‌ల తయారీని ఆపేస్తున్నట్లు యాపిల్ వెల్లడించింది.