బడి, గుడి అని కూడా చూడకుండా మద్యం అమ్మారు: టీడీపీ నేతలపై సీఎం జగన్ ధ్వజం

  • జంగారెడ్డి గూడెం మరణాలపై రగడ
  • కల్తీమద్యం మరణాలంటున్న టీడీపీ
  • అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • సాధారణ మరణాలను వక్రీకరిస్తున్నారని వెల్లడి
జంగారెడ్డి గూడెం మరణాల నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ టీడీపీ నేతలపై అసెంబ్లీలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాధారణ మరణాలను సైతం టీడీపీ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. దేశంలో 90 శాతం సహజమరణాలే ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పుడు సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని విమర్శించారు. సాధారణ మరణాలను కల్తీమద్యం మరణాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కల్తీ మద్యం మరణాలు గతంలోనూ జరిగాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో లాభాలే పరమావధిగా బడి, గుడి అని కూడా చూడకుండా ఇష్టానుసారం మద్యం అమ్మకాలు సాగించారని సీఎం జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక కల్తీమద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపామని, 43 వేల బెల్టు షాపులను తొలగించామని చెప్పారు.


More Telugu News