ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి: జీవీఎల్

  • కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాలు
  • రాజ్యసభలో పెట్రో ధరలపై మాట్లాడిన జీవీఎల్
  • సుంకం తగ్గించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు
  • రాష్ట్రాలతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ జీరో అవర్ లో పెట్రో ధరలపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 శాతం, డీజిల్ పై 10 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, చాలా రాష్ట్రాలు ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించలేదని అన్నారు. 

ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయని జీవీఎల్ వెల్లడించారు. ఇప్పటికైనా ఆయా రాష్ట్రాలు ఇంధన ధరలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు.


More Telugu News