అందుకే నేను రాజీనామా చేశా: స్పీకర్ తమ్మినేనికి ఎమ్మెల్యే గంటా లేఖ
- విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నేను వ్యతిరకం
- కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గత ఏడాది రాజీనామా
- నా రాజీనామాను ఆమోదించాలన్న గంటా
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గత ఏడాది తాను రాజీనామా చేశానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశానని చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను ఆయన మరోసారి కోరారు.
ఈ మేరకు గంటా శ్రీనివాసరావు.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఈ రోజు ఓ లేఖ రాశారు. తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశానని, ఏడాదికి పైగా కార్మికులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన అన్నారు.