ప్యాకేజీల కోసమే పవన్ కల్యాణ్ నేడు సభ నిర్వహిస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి
- ఐపీఎల్‌లో క్రీడాకారుల వేలంపాట జరుగుతుంది
- పవన్ కల్యాణ్ కూడా సభలు పెట్టి ప్యాకేజీలు పెంచుకోవడానికే ప్రయత్నాలు
- ఆయన వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు
- సభలు పెడితే ప్యాకేజీలు ఎక్కువగా వస్తాయని పవన్ యత్నాలు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోన్న నేపథ్యంలో వైసీపీ నేతలు దాన్ని అడ్డుకునేందుకు అలజడి సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''ఐపీఎల్‌లో క్రీడాకారుల వేలంపాట జరుగుతుంది. అదే విధంగా పవన్ కల్యాణ్ కూడా సభలు పెట్టి ప్యాకేజీలు పెంచుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు. ఆయన వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు.
సభలు పెడితే ప్యాకేజీలు ఎక్కువగా వస్తాయనేది ఆయన ఉద్దేశమని, తనకు ఎంత ఎక్కువగా వస్తాయనే దానిపైన మాత్రమే పవన్ యత్నాలని మంత్రి ఎద్దేవా చేశారు. ''నాకింత మంది జనం ఉన్నారని నిరూపించుకోవడానికి ఇటువంటి సభలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఏమైనా ఉందా? ఎవరైనా ఆయనను నమ్ముతారా? పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి ఉదయం విమానంలో ఏపీకి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోతారు. అటువంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారు?'' అని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.