షేన్ వార్న్ పాటించిన లిక్విడ్ డైట్ క్షేమకరమేనా?
- చనిపోవడానికి 14 రోజుల ముందు నుంచి వార్న్ లిక్విడ్ డైట్
- దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు
- వైద్య సలహా లేకుండా వాడడం మంచిది కాదంటున్న నిపుణులు
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అకాల మరణం ఎంతో మందిని షాక్ కు గురి చేసింది. సహజ కారణాలతోనే ఆయన మరణించినట్టు వైద్యులు తేల్చారు. అయితే చనిపోవడానికి 14 రోజుల ముందు నుంచి వార్న్ కేవలం ద్రవాహారం (లిక్విడ్ డైట్) తీసుకుంటున్నాడంటూ ఓ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో మరణానికి ఇది కూడా తోడై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బరువు తగ్గాలన్నది వార్న్ లక్ష్యం. ఇందుకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా ఇటీవల చేశారు. అందులో భాగంగానే ఆయన మధ్య మధ్యలో లిక్విడ్ డైట్ తీసుకుంటూ ఉండేవాడు.
లిక్విడ్ డైట్ తో రిస్క్ లు
వార్న్ మరణానికి లిక్విడ్ డైట్ కారణమని వైద్యులు తేల్చలేదు. కానీ, లిక్విడ్ డైట్ తో సమస్యలు ఉన్నాయంటున్నారు వైద్యులు. హార్ట్ ఫౌండేషన్స్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ గ్యారీ జెన్నింగ్స్ చెబుతున్న దాని ప్రకారం.. కొన్ని సందర్భాల్లో తక్కువ కేలరీలు ఉన్న ఆహారం గుండెపై ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ఉప్పు, ఇతర ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం లోపిస్తే స్వల్ప స్థాయిలో హార్ట్ ఎటాక్ కూడా రావచ్చు. హృదయ స్పందనల సమస్యకు దారితీస్తుంది.
లిక్విడ్ డైట్స్ తో కనీస పోషకాలు లభిస్తాయి. కానీ, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ మధ్య సమతుల్యత ఉండదు. కేలరీలు తక్కువగా ఉంటాయి. కనుక వైద్యుల సలహా లేకుండా లిక్విడ్ డైట్ పాటించకూడదు. ముఖ్యంగా గర్భిణులు, మధుమేహంతో బాధపడుతున్న వారు, ఇన్సులిన్ తీసుకునే వారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు లిక్విడ్ డైట్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.