ఆడవారి పసుపు, కుంకుమతో చెలగాటమాడారు: అసెంబ్లీలో చంద్రబాబుపై రోజా ఫైర్
- చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎనీ టైమ్ మందు దొరికేది
- ఎప్పుడు చూసినా నా సీనియారిటీ చూడు అని చంద్రబాబు అంటారు
- ఐదేళ్లలో 75 వేల కోట్ల రూపాయల మద్యాన్ని ఏరులై పారించారు
- వీరు మద్యం గురించి మాట్లాడుతుంటే పైనున్న ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది
ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతోన్న నేపథ్యంలో సభలో టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ... ''చంద్రబాబు ఇచ్చిన పచ్చ కార్డులను పట్టుకుని ఇక్కడ టీడీపీ సోదరులు ఆందోళన చేస్తున్నారు. ఆ పచ్చ కార్డుల్లో ఏముందో వారికి తెలుసు. అందుకే ఆ పచ్చ కార్డులనే చించేస్తున్నారు.
ఏపీలో బెల్టు షాపులు అన్నింటినీ మూసేస్తానని 2014లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఐదేళ్లలో ఏపీలో 40 వేలకు పైగా బెల్టు షాపులను తెరిచారు. మద్యం సిండికేట్లతో కుమ్మక్కై ఆడవారి పసుపు, కుంకుమతో చెలగాటమాడారు. అందుకే ప్రతి మహిళా గుర్తు పెట్టుకుని వారి ప్రభుత్వాన్ని ఛీ కొట్టి తరిమికొట్టింది.
ఇంటింటికీ మినరల్ వాటర్ ఇస్తామని చెప్పి, ఇంటింటికీ క్వార్టర్ బాటిల్ మాత్రం ఇచ్చారు. ఆరు వేల పాఠశాలలు మూసేసి, 40 వేలకు పైగా బెల్టు షాపులు తెరిచారు. 2022 వరకు మద్యం షాపులకు అనుమతులు ఇస్తూ 2017లోనే టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఆడవాళ్ల జీవితాలతో వారు ఎలా ఆడుకున్నారో దీన్ని బట్టే తెలుస్తోంది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎనీ టైమ్ మందు దొరికేది. ఎప్పుడు చూసినా నా సీనియారిటీ చూడు అని చంద్రబాబు అంటారు. ఐదేళ్లలో 75 వేల కోట్ల రూపాయల మద్యాన్ని ఏరులై పారించారు. వీరు మద్యం గురించి మాట్లాడుతుంటే పైనున్న ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది.
ఆనాడు ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తీసుకొస్తే ఆయనను అధికారంలోంచి దించేసి మద్యాన్ని ఏరులై పారించింది చంద్రబాబు నాయుడు కాదా? గత చంద్రబాబు పాలనలో మహిళలపై నేర రేటు పెరిగిపోయింది. చంద్రబాబును మెప్పించడానికే సభను అడ్డుకుంటూ టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.
అంతేగానీ, ప్రజల మంచి కోసం కాదు.. ప్రజల సమస్యలను చర్చించడానికే సభను నిర్వహించాలి. సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోన్న టీడీపీ సభ్యులకు బుద్ధి చెప్పాలి'' అని రోజా అన్నారు.