పంత్ తన సత్తా చూపించాడు.. ప్రతి ఒక్కరూ అలా ఆడలేరు: బుమ్రా
- 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన పంత్
- రోజురోజుకీ అనుభవం సాధిస్తున్నాడన్న బుమ్రా
- రానున్న రోజుల్లో అది జట్టుకు లాభిస్తుందని వ్యాఖ్య
టీమిండియా వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటతీరును ప్రశంసించాడు. తిరిగి తన ఫామ్ ను చూపించాడని కొనియాడాడు. శ్రీలంకతో బెంగళూరులో ఆదివారం రెండో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ లో పంత్ కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. జట్టులో శ్రేయాస్ అయ్యర్ (67) తర్వాత మెరుగైన స్కోరు పంత్ కే సాధ్యపడింది.
పిచ్ పై బాల్ ఆధిపత్యం కొనసాగే చోట పంత్, అయ్యర్ చూపించిన ప్రతిభ టీమిండియా మంచి ఆధిక్యం సాధించేలా చేసింది. దీనిపైనే బుమ్రా స్పందించాడు. ‘‘జట్టులో ప్రతి ఒక్కరు అదే టెంపోలో ఆడలేకపోవచ్చు. ప్రతి ఒక్కరికి భిన్నమైన ఆట ప్రణాళికలు ఉండొచ్చు. అతడు మరింత అనుభవం సంపాదించుకుంటున్నాడు. అదే రానున్న రోజుల్లో మాకు అనుకూలిస్తుంది’’ అని పంత్ ను ఉద్దేశించి బుమ్రా పేర్కొన్నాడు.
రెండో టెస్టులో బుమ్రా మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి శ్రీలంక జట్టు వెన్ను విరించిన సంగతి విదితమే. దీంతో శ్రీలంక 109 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అంతేకాదు రెండో ఇన్నింగ్స్ లోనూ తొలి వికెట్ బుమ్రా ఖాతాలోనే పడింది. మొదటి టెస్ట్ లో జడేజా చెలరేగిపోతే.. రెండో టెస్ట్ లో బుమ్రా ఆధిపత్యం కొనసాగుతోంది. బెంగళూరు స్టేడియం పేస్ కు సహకరిస్తోంది.