టీడీపీ సభ్యుల ఆందోళన.. ఏపీ అసెంబ్లీలో గందరగోళం
- ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు
- జంగారెడ్డిగూడెంలో నాటు సారా కలకలంపై టీడీపీ నిరసన
- స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు
ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటు సారా కారణంగా వరుస మరణాలు సంభవిస్తోన్న నేపథ్యంలో దీనిపై చర్చ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేశారు. దీంతో సభను స్పీకర్ తమ్మినేని కాసేపు వాయిదా వేశారు.
అనంతరం సభ మళ్లీ ప్రారంభమైంది. సభలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు తెలిపారు. చర్చలు జరగకుండా సభను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సభలో ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.