జనసేన సభకు ఆటంకాలు కలిగించవద్దని అధికారులను కోరుతున్నాం: నాదెండ్ల

  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు జనసేన సభ
  • ఇప్పటం గ్రామం వద్ద భారీ ఏర్పాట్లు
  • పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపిన నాదెండ్ల
  • సామాన్యుల ఆత్మగౌరవ పోరు అని వెల్లడి
రేపు (మార్చి 14) జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నేపథ్యంలో ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇప్పటం వద్ద జనసేన సభ ఉంటుందని వెల్లడించారు. రేపటి సభలో జనసైనికులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో కర్తవ్యబోధ చేస్తారని వివరించారు. 

ఓ ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందని నాదెండ్ల పేర్కొన్నారు. సభకు ఆటంకం కలిగించవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకునే వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఉద్ఘాటించారు. జగన్ అహంభావం, సామాన్యుల ఆత్మగౌరవానికి పోరాటమే ఈ సభ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన పార్టీ లక్ష్యమని అన్నారు.


More Telugu News