ఏపీలో బాగా తగ్గిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 11,980 కరోనా పరీక్షలు
- అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 84 మంది
- ఇంకా 606 మందికి చికిత్స
ఏపీలో కొవిడ్ మహమ్మారి ప్రభావం క్షీణదశకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య బాగా పడిపోయింది. ప్రస్తుతం ఏపీలో 606 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 11,980 కరోనా పరీక్షలు నిర్వహించగా, 57 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదు.
అదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18,858 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,522 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 14,730 మంది మృత్యువాతపడ్డారు.
.