తనయుడు పంజాబ్ సీఎంనే ఓడించాడు... అయినా స్వీపర్ గానే పనిచేస్తున్న మహిళ
- ఇటీవల ముగిసిన పంజాబ్ ఎన్నికలు
- సంచలనం సృష్టించిన లాభ్ సింగ్ ఉగోక్
- సీఎం చరణ్ జిత్ చన్నీపై ఘనవిజయం
- లాభ్ సింగ్ తల్లి ఓ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలు
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద సంచలనం అంటే సీఎం చరణ్ జిత్ చన్నీ ఓడిపోవడమే. బదౌర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన చన్నీని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి లాభ్ సింగ్ ఉగోక్ 37,550 ఓట్ల భారీ తేడాతో ఓడించాడు. దాంతో దేశవ్యాప్తంగా లాభ్ సింగ్ పేరు మార్మోగిపోయింది. లాభ్ సింగ్ నేపథ్యం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.
లాభ్ సింగ్ ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాగా, ఆయన తల్లి బల్దేవ్ కౌర్ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తోంది. తనయుడు ఆప్ ఎమ్మెల్యేగా గెలిచే క్రమంలో సంచలనం సృష్టించినప్పటికీ, ఆమె మాత్రం తన వృత్తిని వీడలేదు. ఎప్పట్లాగానే పాఠశాలలో చీపురు పట్టుకుని ఊడ్చుతూ కనిపించింది.
ఆమెను మీడియా పలకరించగా, తాము పొట్టకూటి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంటామని, తన బిడ్డ ఏ హోదాలో ఉన్నప్పటికీ పాఠశాలలో స్వీపర్ గానే కొనసాగుతానని కౌర్ స్పష్టం చేసింది. యాదృచ్ఛికంగా తన కుమారుడి ఎన్నికల గుర్తు కూడా చీపురుకట్టేనని, తన చేతిలో ఉండేది కూడా చీపురేనని పేర్కొంది. చీపురు తన జీవితంలో ముఖ్యమైన వస్తువు అని కౌర్ వివరించింది. కుమారుడు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల సంతోషంగా ఉందని తెలిపింది. సీఎంపై పోటీ చేస్తున్నా సరే, తన బిడ్డ తప్పక గెలుస్తాడని భావించామని వెల్లడించింది.
కాగా, బల్దేవ్ కౌర్ పనిచేస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్ అమృత్ పాల్ కౌర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిచిన లాభ్ సింగ్ ఉగోక్ తమ పాఠశాలలోనే చదివాడని వెల్లడించారు. తమ పాఠశాలకు అనేక ఘనతలు అందించాడని కొనియాడారు. కుమారుడు ఎమ్మెల్యే అయినప్పటికీ తల్లి బల్దేవ్ కౌర్ తమ పాఠశాలలో స్వీపర్ గా కొనసాగాలనే కోరుకుంటోందని ప్రిన్సిపాల్ తెలిపారు.