రోహిత్ కొట్టిన సిక్సర్ తో అభిమాని ముక్కు ఎముక విరిగింది
- ముక్కు పగిలి విలవిల్లాడిన అభిమాని
- వెంటనే ఆసుపత్రికి తరలింపు
- ఎక్స్ రే తీసి.. కుట్లు వేసి పంపిన వైద్యులు
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ తక్కువ పరుగులకే ఔటై ఉండొచ్చుగానీ.. ఇన్నింగ్స్ లో అతడు కొట్టిన సిక్స్ మాత్రం హైలైట్. శ్రీలంక ఎడమ చేతి వాటం పేసర్ విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని.. చాలా అందంగా లాఫ్టెడ్ షాట్ తో సిక్సర్ గా మలిచాడు. అయితే, స్టాండ్ లో పడిన బంతితో ఓ ప్రేక్షకుడి ముక్కు పగిలింది.
డి కార్పొరేట్ బాక్స్ లో కూర్చున్న 22 ఏళ్ల ఆ క్రికెట్ అభిమాని నొప్పితో విలవిల్లాడిపోయాడు. రక్తం కారడంతో వెంటనే అతడిని హస్మత్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్ రే తీయడంతో.. ముక్కు ఎముక విరిగిందని తేలింది. గాయానికి వైద్యులు కుట్లు వేశారు. పెద్దగా ప్రమాదమేమీ లేదని, రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
కాగా, గుండప్ప విశ్వనాథ్ జీవిత చరిత్ర పుస్తకం విడుదల సందర్భంగా నిన్న చిన్నస్వామి స్టేడియంలో దిగ్గజాలు ఒక్కచోట కలిశారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, అన్షుమాన్ గైక్వాడ్, రోజర్ బిన్నీ, బ్రజేశ్ పటేల్, శాంతా రంగస్వామి వంటి ప్రముఖులు కలిసి విశ్వనాథ్ పుస్తకాన్ని విడుదల చేశారు.