ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సినీ న‌టుడు నాగ‌బాబు

  • నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశా
  • ఎన్నో విపత్తులను ఎదుర్కొని న‌న్ను నేనుగా మార్చుకోగలిగా
  • నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా వెళ్ల‌డానికి  ఉపయోగిస్తా
  • మరిన్ని వివరాలతో త్వరలో ప్ర‌జ‌ల‌ ముందుకొస్తా
సినీ న‌టుడు నాగ‌బాబు ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇన్నాళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాన‌ని.. ఎన్నో విపత్తులను ఎదుర్కొని తన‌ను తానుగా మార్చుకోగలిగానని తెలిపారు. అయితే, ఈ ఆపదలు, కష్టాలే త‌న‌ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి బాగా సాయ‌ప‌డ్డాయ‌ని చెప్పారు. తాను పుట్టి పెరిగిన దేశానికి, త‌న‌ ప్రజలకు సాయ‌పడాలని నిర్ణయించుకున్నాన‌ని, అదే గమ్యంగా త‌న లక్ష్యం వైపు పయనించానని తెలిపారు. 

తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ త‌న‌ను ప్రతిసారి వెన్నంటి నడిపించి త‌నకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలేన‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పటి నుంచి త‌న పూర్తి సమయాన్ని త‌న గమ్యం దిశగా వెళ్ల‌డానికి  ఉపయోగించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. 

దీనిపై మరిన్ని వివరాలతో త్వరలో ప్ర‌జ‌ల‌ ముందుకొస్తాన‌ని అన్నారు. త‌న‌ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. గత ఎన్నిక‌ల్లో నాగ‌బాబు పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. జ‌న‌సేన ఆవిర్భావ స‌భకు రంగం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు చేసిన ఈ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. 

               


More Telugu News