పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ బృందంలో తెలుగు వ్యక్తి
- సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న భగవంత్‌మాన్
- సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా వేణుప్రసాద్
- వేణుది సూర్యాపేట జిల్లాలోని పెంచికల్‌దిన్నె
- పంజాబ్ కేడర్‌లో విధులు
పంజాబ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌మాన్ త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్ అధికారి అరిబండి వేణుప్రసాద్ తెలుగువారు కావడం గమనార్హం. ఆయనది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పెంచికల్‌దిన్నె.
నాగార్జున సాగర్‌లో ఇంటర్, బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన వేణుప్రసాద్.. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ ఎంఎస్సీ పూర్తి చేశారు. 1991లో ఐఏఎస్‌గా ఎంపికై పంజాబ్ కేడర్‌లో పనిచేస్తున్నారు. ఫరీద్‌కోట్, జలంధర్ జిల్లాల కలెక్టర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్ విద్యుత్ సంస్థ సీఎండీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.