కారు స్పీడు మీదుంది.. బీజేపీతో ఏమీ కాదు: అసదుద్దీన్ ఓవైసీ
- అసెంబ్లీలో కేటీఆర్‌తో ఓవైసీ భేటీ
- వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఫలితం లేదన్న ఓవైసీ
- కేటీఆర్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని వెల్లడి
ఇటీవలే ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వాటిని ఆధారం చేసుకుని త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేతలు సంధిస్తున్న వ్యాఖ్యలకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పవర్ ఫుల్ పంచ్ డైలాగులు సంధించారు. శనివారం తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన ఓవైసీ.. మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా బీజేపీపై ఆయన పంచ్ డైలాగులు సంధించారు.
కారు మంచి స్పీడు మీద ఉందని చెప్పిన ఓవైసీ.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తనదైన జోరుతో సాగుతోందని చెప్పారు. టీఆర్ఎస్ పటిష్ఠంగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై బీజేపీ ఎంతగా దృష్టి సారించినా, వారికేమీ ఫలితం దక్కదని ఓవైసీ అన్నారు. కేటీఆర్‌తో భేటీలో రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని, హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులు, ఇటీవలే ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపైనే తాము చర్చించామని ఓవైసీ చెప్పుకొచ్చారు.