మోదీ నిర్మాణం, పీకే డైరెక్షన్, కేసీఆర్ యాక్టింగ్: మధు యాష్కీ గౌడ్
- బీజేపీకి బీ టీంగా మజ్లిస్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్
- కుట్రపూరితంగానే రాహుల్‌పై విమర్శలు
- మధు యాష్కీ గౌడ్ విసుర్లు
ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఘోర పరాజయాన్ని చూపి వైరివర్గాలు కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంతగా బలహీనంగా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే గాంధీ కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కూడా యాష్కీ ప్రశ్నించారు.
ఈ మేరకు శనివారం టీపీసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన యాష్కీ.. బీజేపీతో పాటు టీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు బలహీనులు అయితే.. మోదీ ఎందుకు పదే పదే గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని యాష్కీ ప్రశ్నించారు.
సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వానికి మద్దతు ఇస్తూ పీసీసీ తీర్మానం చేసిందని, ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నిరుత్సాహ పడకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్, గోవాలో కాంగ్రెస్ గెలుపును టీఏంసీ లాంటి పార్టీలు దెబ్బతీశాయని ఆయన ఆరోపించారు.
మోదీ ప్రొడక్షన్‌లో పీకే డైరెక్షన్ లో కేసీఆర్ నటిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ,, బీజేపీకి బీ టీంగా పనిచేస్తోందన్నారు. యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ శ్రమను గౌరవిస్తున్నామని, కుట్ర పూరితంగా రాహుల్ గాంధీపై దుష్ప్రచారం చేశారని యాష్కీ ఆరోపించారు.