వివేకా హత్యకేసు దర్యాప్తును అడ్డుకుంటున్న పెద్ద శక్తులు: వర్ల రామయ్య
- ఇంకా కొలిక్కి రాని సీబీఐ దర్యాప్తు
- కీలక నిందితులను అరెస్ట్ చేసినట్టు సీబీఐ వెల్లడి
- దర్యాప్తు తీరుపై టీడీపీ వరుస వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి జరుగుతున్న సీబీఐ దర్యాప్తుపై గత కొంత కాలంగా విపక్ష టీడీపీ వరుసగా కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా శనివారం నాడు టీడీపీ నేత వర్ల రామయ్య ఈ కేసు దర్యాప్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కొన్ని పెద్ద శక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని జనం అనుకుంటున్నారని పేర్కొన్న ఆయన.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అంచెలంచెలుగా సాగుతోందని వ్యాఖ్యానించారు. ఈ అంతఃపుర రహస్యాన్ని ఛేదించడం సీబీఐకి పెద్ద పనేమీ కాదని, అయితే సీబీఐకి ఉన్న అడ్డంకులు తొలగిపోతే ఈ కేసులోని వాస్తవాలన్నీ చకచకా బయటకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.