వైరల్ న్యూస్!.. సోనియా, రాహుల్, ప్రియాంక తమ పదవులకు రాజీనామా?
- రేపు ఢిల్లీలో సీడబ్ల్యూసీ భేటీ
- భేటీలో ముగ్గురు నేతల రాజీనామా
- నేషనల్ మీడియాలో కథనాలు
జాతీయ మీడియాలో ఇప్పుడో వార్త వైరల్‌గా మారిపోయింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌లో రేపు ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుందని ఆ వార్త చెబుతోంది. పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీతో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలు తమతమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నారట. కాంగ్రెస్ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వార్తను ఇస్తోంది.
ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మేర పార్టీ దుస్థితికి కారణమెవరంటూ పార్టీలోని సీనియర్లు అప్పుడే నిరసన గళం విప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలోనే సోనియా, రాహుల్, ప్రియాంకలు తమ పదవులకు రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలో ఏ మేర వాస్తవముందో తెలియదు గానీ.. ఇప్పుడు ఈ వార్త దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.