'బెంగుళూరు నాగరత్నమ్మ' బయోపిక్.. కథానాయికగా ఆ ఇద్దరిలో ఒకరు!
- సింగీతం దర్శకత్వంలో 'బెంగుళూరు నాగరత్నమ్మ'
- ఓ దేవదాసీ బయోపిక్ కి సన్నాహాలు
- బుర్రా సాయిమాధవ్ సంభాషణలు
- అనుష్క, సమంతలతో సంప్రదింపులు
తెలుగులోని సీనియర్ దర్శకులలో సింగీతం శ్రీనివాసరావు స్థానం ప్రత్యేకం. 'పుష్పక విమానం' .. 'ఆదిత్య 369' .. 'భైరవద్వీపం' వంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది. చాలా గ్యాప్ తరువాత ఆయన ఒక కథను తయారు చేసుకున్నారు. ఆ కథతో సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ కథకు ఆయన పెట్టుకున్న పేరు 'బెంగుళూరు నాగరత్నమ్మ'. చాలా కాలం క్రితంనాటి ఒక దేవదాసీ కథ ఇది. ఈ కథకి ఆయన బుర్రా సాయిమాధవ్ తో మాటలు రాయిస్తున్నారు. ఈ కథను సమంతతోగానీ .. అనుష్కతో గాని చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరికీ కథని వినిపించడం జరిగిపోయిందట కూడా.
అయితే ఇంతవరకూ అటు అనుష్క నుంచి గానీ .. ఇటు సమంత నుంచి గాని ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎవరు ఒప్పుకున్నా తన కథకి న్యాయం జరుగుతుందని సింగీతం భావిస్తున్నారు. ప్రస్తుతం స్పీడ్ తగ్గించిన అనుష్క ఓకే అంటుందా? లేదంటే రీసెంట్ గా స్పీడ్ పెంచిన సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది చూడాలి.