ఏపీలో కరోనాతో ఒకరి మృతి... పూర్తి వివరాలు ఇవిగో!
- ఏపీలో కొన్నిరోజుల తర్వాత తొలి మరణం
- 50 మందికి కొత్తగా పాజిటివ్
- అనంతపురం జిల్లాలో 12 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 77 మంది
- ఇంకా 633 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో ఒకరు మరణించారు. గత కొన్నిరోజుల తర్వాత రాష్ట్రంలో కరోనాతో మృతి చెందడం ఇదే ప్రథమం. తాజా మరణంతో ఇప్పటివరకు ఈ వైరస్ మహమ్మారి బారినపడి కన్నుమూసిన వారి సంఖ్య 14,730కి పెరిగింది.
ఇక, రోజువారీ కేసుల విషయానికొస్తే, గడచిన ఒక్కరోజులో 12,789 కరోనా పరీక్షలు నిర్వహించగా, 50 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
అదే సమయంలో 77 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 633 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18,801 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,438 మంది ఆరోగ్యవంతులయ్యారు.
.