చంద్రబాబు జబ్బు అచ్చెన్నకు కూడా అంటింది: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు అంతా నేనే అనుకుంటాడని వ్యాఖ్యలు
  • నాడు-నేడు తమదేనని అచ్చెన్న జబ్బలు చరుస్తున్నాడని ఎద్దేవా 
  • అప్పుడే ఎందుకు చెప్పలేదని నిలదీసిన వైనం
టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రపంచంలో ఏం జరిగినా అందుకు కారణం తానే అని చంద్రబాబు భావిస్తుంటాడని విజయసాయి విమర్శించారు.

 "అది నేనే, ఇది నేనే, అంతా నేనే అనుకునే జబ్బు చంద్రబాబుది. ఇప్పుడా మానసిక రుగ్మత అచ్చెన్నకు కూడా అంటింది. అందుకే నాడు-నేడు కార్యక్రమం టీడీపీదే అంటూ జబ్బలు చరుస్తున్నాడు. మరి నాడు-నేడు గురించి నాడే ఎందుకు చెప్పలేదు? జగన్ కు క్రెడిట్ దక్కకూడదనేనా ఈ డ్రామా?" అంటూ విజయసాయి  ప్రశ్నించారు.


More Telugu News