బెంగళూరులో టీమిండియాను కష్టాల్లోకి నెట్టిన లంక స్పిన్నర్లు
- టీమిండియా, శ్రీలంక రెండో టెస్టు ప్రారంభం
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- 148 పరుగులకే 6 వికెట్లు డౌన్
- 3 వికెట్లు తీసిన ఎంబుల్దెనియ
- 39 పరుగులు చేసిన పంత్
బెంగళూరులో ఆరంభమైన డే నైట్ టెస్టులో శ్రీలంక స్పిన్నర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు పెద్దగా కలిసిరాలేదు. లంక యువ స్పిన్నర్ లసిత్ ఎంబుల్దెనియ 3 వికెట్లు తీయగా, జయవిక్రమ, ధనంజయ డిసిల్లా చెరో వికెట్ పడగొట్టారు. దాంతో భారత్ 148 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. పంత్ 39, విహారి 31, కోహ్లీ 23 పరుగులు చేసి అవుటయ్యారు.
అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ (15), మయాంక్ అగర్వాల్ (4) నిరాశపరిచారు. ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా 4 పరుగులకే వెనుదిరగడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 6 వికెట్లకు 177 పరుగులు కాగా, శ్రేయాస్ అయ్యర్ 37, రవిచంద్రన్ అశ్విన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.