ఒకేసారి 125 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా ప‌దోన్న‌తి కల్పించిన సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

  • సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన స్టీఫెన్ రవీంద్ర  
  • ఇది ఆరంభ‌మేన‌ని ప్ర‌కటించిన ‌క‌మిష‌న‌ర్‌ 
  • స్టీఫెన్ చర్య‌కు ప‌లువురి అభినంద‌న‌
ఇటీవ‌లే సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన స్టీఫెన్ రవీంద్ర పోలీసు శాఖ‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టారు. శ‌నివారం నాడు ఒక్క సంత‌కంతో ఏకంగా 125 మంది కానిస్టేబుళ్ల‌కు హెడ్ కానిస్టేబుళ్లుగా ప‌దోన్న‌తి క‌ల్పించారు. 

కానిస్టేబుళ్ల ప‌దోన్న‌తిపై ఆయన ట్వీట్ ‌చేస్తూ.. ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని ప్ర‌క‌టించారు. పోలీసు శాఖ‌లో నిజాయ‌తీగా ప‌నిచేసే వారికి ప‌దోన్న‌తులు త‌ప్ప‌నిస‌రిగా ల‌భిస్తాయ‌ని, అందుకు ఈ ప‌దోన్న‌తులే నిద‌ర్శ‌న‌మ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. స్టీఫెన్ ర‌వీంద్ర ట్వీట్‌ను మెచ్చుకుంటూ ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాన్ని కొనియాడుతున్నారు.


More Telugu News