అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి
- జోబైడెన్ ప్రభుత్వంలో నేషనల్ కో చైయిర్ ఆఫ్ విమెన్‌గా దుగ్గల్
- తాజాగా పదోన్నతితో నెదర్లాండ్స్ లో అమెరికా రాయబారిగా కొలువు
- బరాక్, హిల్లరీల వద్ద కీలక బాధ్యతల్లో పనిచేసిన దుగ్గల్
అమెరికాలో భారత సంతతికి చెందిన వారు కీలక పదవులను అధిరోహిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత సంతతికే చెందిన మరో మహిళకు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా నియమిస్తూ జో బైడెన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు హిల్లరీ క్లింటన్‌లకు ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌గా విధులు నిర్వర్తించిన దుగ్గల్ ప్రస్తుతం జోబైడెన్ ప్రభుత్వంలో నేషనల్ కో చైయిర్ ఆఫ్ విమెన్‌గా పని చేస్తున్నారు. తాజాగా ఆమెకు పదోన్నతి కల్పిస్తుండటంతో పాటుగా త్వరలో నెదర్లాండ్స్‌కి యూఎస్ రాయబారిగా పంపనున్నారు.
జమ్మూ కశ్మీర్‌కు చెందిన దుగ్గల్ చాలా కాలం క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ కమ్యూనికేషన్‌లో పీజీ చేశారు. ఆ తర్వాత మియామీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత యూఎస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విమెన్ రైట్స్ యాక్టివిస్ట్, హ్యూమన్ రైట్స్ క్యాంపెయినర్‌గా చాలా కాలం పని చేశారు. అనేక అవార్డులు గెలుచుకున్నారు.