వైసీపీ కార్య‌కర్త‌ల డీఎన్ఏ వేరు: స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

  • తాడేప‌ల్లి, పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆవిర్భావ వేడుక‌లు
  • పార్టీ బ‌లోపేతంతో పాటు ప్ర‌భుత్వ పాల‌న కీలకమన్న సజ్జల
  • అందుకే చంద్ర‌బాబు ముంద‌స్తు రాగం అందుకున్నార‌ని విమర్శ 
ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 ఏళ్ల ప్ర‌స్థానాన్ని ముగించుకుని శ‌నివారం 12వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకుంటున్నారు. పార్టీ 12వ వ‌సంతాన్ని గుర్తు చేసుకుంటూ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా స్వ‌యంగా ఓ ట్వీట్ చేశారు. 

ఇక తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన వేడుక‌ల్లో పాలుపంచుకున్న సంద‌ర్భంగా పార్టీ కీల‌క నేత‌, ఏపీ ప్రభుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ బ‌లోపేతంతో పాటు ప్ర‌భుత్వ పాల‌న కూడా త‌మ‌కు కీల‌క‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే కేబినెట్ పున‌ర్వవ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని కూడా ఆయ‌న చెప్పారు.

ఈ సందర్భంగా విప‌క్ష టీడీపీపై ఆయన విమ‌ర్శ‌లు సంధించారు. త‌మ పార్టీ నేత‌ల‌ను లాక్కోవాల‌నుకోవ‌డం టీడీపీ భ్ర‌మేన‌ని చెప్పిన స‌జ్జ‌ల‌.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల డీఎన్ఏ వేరు అని వ్యాఖ్యానించారు. టీడీపీని కాపాడుకునేందుకు చంద్ర‌బాబు ముంద‌స్తు రాగం అందుకున్నార‌ని ఆరోపించిన స‌జ్జ‌ల.. టీడీపీ కేడ‌ర్‌లో చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై న‌మ్మ‌కం పోయింద‌ని అన్నారు. 


More Telugu News