విదేశాల్లోనూ 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఈ రేంజ్‌లో క్రేజ్ ఉంది.. వీడియో ఇదిగో
- రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్'
- విడుదలకు సిద్ధమైన మూవీ
- #RRRMassBegins పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు
- కెనడాలో కార్లతో ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ పేర్లు
రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ ఈ సినిమాకు సంబంధించిన హడావుడి షురూ అయింది. #RRRMassBegins పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో తెలిపేలా ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.
కెనడా అభిమానులు ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ పేర్లను కార్లతో రూపొందించారు. ఎన్టీఆర్‌కు వారు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. కరోనా తగ్గడంతో ఈ నెల 25న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మళ్లీ మొదలు పెడుతున్నారు. కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో 'ఆర్ఆర్ఆర్' విడుదలతో సినిమా థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున రావడం మొదలు పెడతారని అంచనాలు ఉన్నాయి.