నేను లేని సమయంలో నా కొడుకు రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారు: ఎమ్మెల్యే వనమా

  • నా కుమారుడు రాఘవపై కుట్రలు పన్నారు
  • పార్టీ జిల్లా అధ్యక్షుడు కావాల్సినవాడి భవిష్యత్తును నాశనం చేశారు
  • కుట్రలు చేసిన వారి బండారం బయటపెడతానన్న వనమా  
ఖమ్మం జిల్లా పాల్వంచలో ఆమధ్య నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తెలంగాణలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ 61 రోజులు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఘటనపై వనమా వెంకటేశ్వరరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈరోజు అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ, రెండు నెలల పాటు తాను అనారోగ్యంతో బాధ పడ్డానని... నేను లేని ఆ సమయంలో తన కుమారుడు రాఘవపై కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కావాల్సిన తన కుమారుడి భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. తాను ఆరోగ్యంతో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. తన కుమారుడిపై కుట్రలు చేసిన వారి బండారాన్ని బట్టబయలు చేస్తానని చెప్పారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర పార్టీల వారు కూడా కుమ్మక్కయ్యారని అన్నారు.


More Telugu News