యుద్ధ భూమికి మీ పుత్రులను పంపొద్దు.. రష్యా మహిళలకు జెలెన్ స్కీ అభ్యర్థన
- రష్యాతో యుద్ధం కీలక మలుపునకు చేరింది
- ఉక్రెయిన్ ను కాపాడుకుంటాం
- లక్ష్యాన్ని, విజయాన్ని సాధిస్తాం
- వీడియో సందేశం విడుదల చేసిన జెలెన్ స్కీ
రష్యాతో యుద్ధం కీలక మలుపులో ఉందని ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. రష్యా సైనికులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకుని, చుట్టూ దిగ్బంధనం చేసిన దశలో జెలెన్ స్కీ ఈ ప్రకటన చేయడం అంతుపట్టకుండా ఉంది. తమ కుమారులను యుద్ధభూమికి పంపించొద్దంటూ రష్యా తల్లులను ఆయన అభ్యర్థించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
‘‘ఉక్రెయిన్ ఒక వ్యూహాత్మక మలుపునకు చేరుకుంది. ఉక్రెయిన్ భూభాగాన్ని స్వేచ్ఛగా ఇంకెంత కాలం కాపాడుకుంటామన్నది చెప్పడం అసాధ్యం. కానీ, మేము ఆ పని చేస్తామని చెబుతున్నాం. మా లక్ష్యం దిశగా, విజయం దిశగా అడుగులు వేస్తున్నాం’’ అంటూ వీడియోలో జెలెన్ స్కీ ప్రకటించారు.
రష్యా సైన్యం ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు పట్టణాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. కీవ్ చుట్టూ మోహరించి ఉంది. కీవ్ పై ఏ క్షణమైనా దాడికి దిగొచ్చన్నది బ్రిటన్ రక్షణ శాఖ అంచనా. కీవ్ చుట్టూ రష్యా సైనికుల మోహరింపులను శాటిలైట్ చిత్రాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి.