‘బాహుబలి 3’ గురించి ప్రభాస్ ఏమన్నాడంటే...!
- నాకూ ‘బాహుబలి 3’ చేయాలనే ఉంది
- ఇప్పటికిప్పుడైతే సాధ్యమయ్యేదైతే కాదు
- అదంతా రాజమౌళి అనుకుంటేనే సాధ్యం
- చిన్న సినిమాలూ చేయాలని ఉందన్న ప్రభాస్
‘బాహుబలి’తో కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆధునిక జ్యోతిష్యుడిగా ‘రాధేశ్యామ్’తో అందరి ముందుకు వచ్చాడు. మరోపక్క, ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తర్వాత ‘బాహుబలి 3’పై చాలా మంది చర్చలు మొదలుపెట్టారు. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి, ప్రభాస్ లకు ఆ ప్రశ్నలు ఎదురయ్యాయి.
దానిపై ప్రభాస్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తానూ ‘బాహుబలి 3’ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఓ గ్రూప్ ఇంటరాక్షన్ సందర్భంగా అతడు తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. ‘‘నా మనసుకు దగ్గరైన చిత్రం బాహుబలి. నా కెరీర్ లో అంతటి ప్రభావాన్ని చూపించిన సినిమా అది. ‘బాహుబలి 3’ అనేది జరుగుతుందా? లేదా? అన్నది నాకు తెలియదు. ఇప్పటికిప్పుడైతే జరిగే ప్రసక్తే లేదు. కానీ, రాజమౌళి అనుకుంటేనే ‘బాహుబలి 3’ సాధ్యమవుతుంది’’ అని తెలిపాడు.
ప్రేక్షకుల్లో బాహుబలి ప్రభావం అమితంగా ఉందని, ప్రతిసారీ ప్రభాస్ ను బాహుబలిలాగానే చూడాలనేలా వారిలో నాటుకుపోయిందని అన్నాడు. తనకు మాత్రం అంత ఉత్సుకత ఏమీ లేదని పేర్కొన్నాడు. అయితే, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వంటి సినిమాలను చూస్తూ పెరిగిన తాను.. బాహుబలి లాంటి సినిమాల్లో చేయడాన్ని ఇష్టపడతానని తెలిపాడు. అదే సమయంలో చిన్న సినిమాలనూ చేసేందుకు ఆసక్తి చూపిస్తానన్నాడు. ప్రేక్షకుల కోసం కొత్తగా ఏదైనా చేయాలన్న తపన ఉందని ప్రభాస్ చెప్పాడు.