సింగపూర్‌లా హైదరాబాద్ కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలి: సీజేఐ ఎన్వీ రమణ
- హైదరాబాద్‌లో ఐఏఎంసీ శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన
- కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ
- ఐఏఎంసీ ప్రతిపాదనను చెప్పగానే కేసీఆర్ అంగీకరించారని వ్యాఖ్య
- మధ్యవర్తిత్వం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్న సీజేఐ
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) శాశ్వత భవన నిర్మాణానికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ మంత్రులు కూడా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. సింగపూర్‌లా హైదరాబాద్ కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని ఆకాంక్షించారు.
ఐఏఎంసీ ప్రతిపాదనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పగానే అంగీకరించారని ఆయన అన్నారు. ఇప్పటికే తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. శాశ్వత భవనం కోసం గచ్చిబౌలిలో భూమిని కేటాయించారని అన్నారు. మధ్యవర్తిత్వం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఐఏఎంసీ శాశ్వత భవన నిర్మాణం ఏడాదిలో పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ భవనం కోసం రూ.50 కోట్లు కేటాయించారని వివరించారు.