ఉక్రెయిన్ రాజ‌ధానిలోకి ర‌ష్యా బ‌ల‌గాల ఎంట్రీ

  • కీవ్ స్వాధీనం కోసం ఇప్ప‌టికే య‌త్నాలు
  • ప్ర‌తిఘ‌టించి అడ్డుకున్న ఉక్రెయిన్ బ‌ల‌గాలు
  • ఎట్ట‌కేల‌కు కీవ్‌ను చుట్టిముట్టి ఎంట్రీ ఇచ్చేసిన ర‌ష్యా
  • భీక‌ర కాల్పుల‌తో ముందుకు సాగుతున్న వైనం
ఉక్రెయిన్‌ను పూర్తిగా వ‌శం చేసుకునే దిశ‌గా యుద్ధం మొద‌లుపెట్టిన ర‌ష్యా త‌న చివ‌రి ల‌క్ష్యం అయిన ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించింది. ఈ మేర‌కు భార‌త కాలమానం ప్ర‌కారం శుక్రవారం రాత్రి ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించిన‌ట్లుగా ప‌లు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు క‌థ‌నాలు ఇస్తున్నాయి. కీవ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతోనే ర‌ష్యా బ‌ల‌గాలు భీక‌రంగా కాల్పులు జ‌రుపుతూ ముందుకు సాగాయ‌ట‌.

ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌ను ఇప్ప‌టికే త‌న స్వాధీనంలోకి తీసుకున్న ర‌ష్యా బ‌ల‌గాలు..వాటికంటే ముందుగానే కీవ్‌ను త‌మ వ‌శం చేసుకోవాల‌ని భావించాయి. అయితే ఉక్రెయిన్ సేన‌ల‌తో పాటు ఆ దేశ సాధార‌ణ పౌరులు కూడా ర‌ష్యా బ‌ల‌గాల‌కు అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టించి వారిని అడ్డుకున్నారు. 

గ‌డ‌చిన కొన్ని రోజులుగా కీవ్ న‌గ‌రాన్ని న‌లుదిశ‌లా చుట్టేసిన ర‌ష్యా బ‌ల‌గాలు శుక్ర‌వారం సాయంత్రం కీవ్ న‌గ‌రంలోకి ఎంట్రీ ఇచ్చేశాయి. ఈ క్ర‌మంలో మ‌రికొన్ని గంటల్లోనే కీవ్ న‌గ‌రాన్నిర‌ష్యా సేన‌లు త‌మ స్వాధీనంలోకి తీసుకునే అవ‌కా‌శాలున్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.


More Telugu News