టీడీపీ పెట్టే తప్పుడు కేసుల‌కు భ‌య‌ప‌డొద్దు.. సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌కు విజయసాయిరెడ్డి భ‌రోసా

  • పార్టీ కేంద్ర కార్యాల‌యంలో భేటీ
  • హాజ‌రైన వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు
  • యాక్టివిస్టుల‌లో ఉత్సాహాన్ని నింపిన సాయిరెడ్డి
  • పార్టీపై దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌ని పిలుపు
వైసీపీ సోష‌ల్ మీడియాకు చెందిన యాక్టివిస్టుల‌తో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి, పార్ల‌మెంటులో పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం వేదిక‌గా జ‌రిగిన ఈ స‌మావేశానికి పార్టీ సోష‌ల్ మీడియా విభాగంలో ప‌నిచేస్తున్న వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. 

భేటీలో భాగంగా సోష‌ల్ మీడియా కార్య‌కర్త‌ల్లో ఉత్సాహం నింపేలా సాయిరెడ్డి ప్రసంగించారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయ్యే పోస్టులు, కామెంట్ల‌తో కేసులు న‌మోదు అవుతూ ఉంటాయ‌ని చెప్పిన ఆయ‌న‌..అలాంటి కేసులకు ఏమాత్రం భ‌య‌ప‌డొద్ద‌ని ఆయన సూచించారు. టీడీపీ పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరమే లేద‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. సీఎం జ‌గ‌న్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ప్రజలకు చేస్తున్న మేలును విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


More Telugu News