ఏపీ డుమ్మా!.. జీఆర్ఎంబీ భేటీ వాయిదా!
- జల సౌధలో జీఆర్ఎంబీ సమావేశం
- తెలంగాణ నుంచి రజత్ కుమార్ హాజరు
- ఏపీ నుంచి అధికారుల గైర్హాజరు
- సమావేశాన్ని వాయిదా వేసిన ఎస్పీ సింగ్
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం శుక్రవారం నాడు ప్రారంభం కాకుండా వాయిదా పడిపోయింది. జీఆర్ఎంబీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ ఎస్‌పీ సింగ్ ఇదివరకే రెండు తెలుగు రాష్ట్రాలకు తెలియజేశారు. హైదరాబాద్‌లోని జల సౌధలో జరగనున్న ఈ భేటీకి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరు కావాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా ఈ భేటీకి ఏపీ అధికారులు గైర్హాజరయ్యారు.
అనుకున్నట్లుగానే శుక్రవారం నాడు జల సౌధలో జీఆర్ఎంబీ సమావేశం మొదలుపెట్టేందుకు ఎస్పీ సింగ్ సిద్ధం కాగా... సమావేశానికి తెలంగాణ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌తో కూడిన ప్రతినిధి బృందం హాజరైంది. అయితే ఏపీ నుంచి ఏ ఒక్కరూ కనిపించలేదు. దీంతో ఏపీ నుంచి అధికారులెవ్వరూ రాని కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ఎస్పీ సింగ్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే..సమావేశానికి హాజరు కాలేమని ఏపీ నుంచి ఎలాంటి సమాచారం జీఆర్ఎంబీకి అందలేదట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రజత్ కుమార్ సభ్యుల హాజరును ధ్రువీకరించుకున్నాకే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.