పాక్ భూభాగంలో క్షిపణి పడిన ఘటనపై భారత్ వివరణ

  •  పాక్ భూభాగంలో పడిన భారత సూపర్ సోనిక్ మిస్సైల్
  • 124 కిలోమీటర్లు ప్రయాణించిన వైనం
  • ఈ నెల 9న ఘటన.. పాక్ తీవ్ర ఆగ్రహం
  • భారత్ వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ
భారత సైన్యానికి చెందిన ఓ సూపర్ సోనిక్ క్షిపణి అనూహ్యరీతిలో పాకిస్థాన్ భూభాగంపై పడింది. దాంతో భారత్ పై పాకిస్థాన్ భగ్గుమంది. భారత క్షిపణి తమ భూభాగంలో 124 కిలోమీటర్లు ప్రయాణించిందని, గగనతలంలో ప్రయాణికులను, భూభాగం, ప్రజల ఆస్తులను ప్రమాదంలో పడేసిందని పాక్ వ్యాఖ్యానించింది. దీనిపై భారత్ వివరణ ఇవ్వాల్సిందేనని ఆగ్రహం వెలిబుచ్చింది. 

ఈ నేపథ్యంలో, పాక్ భూభాగంలో క్షిపణి పడిన ఘటనను భారత రక్షణశాఖ తీవ్రంగా పరిగణించింది. క్షిపణి ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నెల 9న రోజువారీ నిర్వహణలో పొరపాటు జరిగిందని రక్షణశాఖ పేర్కొంది. సాంకేతిక లోపం వల్లే క్షిపణి పాక్ భూభాగంలో పడిందని వివరణ ఇచ్చింది. పాక్ భూభాగంపై తమ క్షిపణి పడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.


More Telugu News