చిరూ సినిమా కోసం రేపటి నుంచి రంగంలోకి సల్మాన్!

  • షూటింగు దశలో 'గాడ్ ఫాదర్'
  • రేపటి నుంచి తాజా షెడ్యూల్ 
  • ప్రత్యేకమైన పాత్రలో సల్మాన్ 
  • దర్శకుడిగా మోహన్ రాజా
చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. చరణ్ - నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమిళనాట దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 

మలయాళంలో మోహన్ లాల్ స్థాయిని నిలబెట్టిన 'లూసిఫర్' కి ఇది రీమేక్. ఆ సినిమాలో పృథ్వీరాజ్ చేసిన పాత్రకిగాను తెలుగు రీమేక్ లో సల్మాన్ ను అనుకున్నారు. మెగాస్టార్ - సల్మాన్ కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి స్నేహబంధం ఉంది. అందువల్లనే ఈ ప్రత్యేకమైన పాత్రను చేయడానికి ఆయన అంగీకరించారు. 

ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలను ముంబై సమీపంలోని ఎన్డీ స్టూడియోస్ లో రేపటి నుంచి చిత్రీకరించనున్నారు. వారం రోజుల పాటు జరిగే చిత్రీకరణతో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. అప్పటివరకూ సల్మాన్ ఫామ్ హౌస్ లో చిరంజీవి ఉంటారట. అత్యంత విలాసవంతమైన ఈ ఫామ్ హౌస్ లో సల్మాన్ కి అత్యంత ఆత్మీయులు మాత్రమే విడిది చేస్తారట.


More Telugu News