సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై చీటింగ్ కేసు నమోదు
- సినిమా నిర్మాణం కోసం బెల్లంకొండ రూ.85 లక్షల అప్పు
- తిరిగి ఇవ్వట్లేదంటూ శరణ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్
- దర్యాప్తు చేపట్టాలంటూ కోర్టు ఆదేశం
- కోర్టు ఆదేశంతో చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మరో ప్రముఖుడిపై చీటింగ్ కేసు నమోదైంది. యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై ఈ కేసు నమోదు కావడం గమనార్హం. సినిమా నిర్మాణం కోసం తన వద్ద రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
సినిమా నిర్మిస్తున్నానంటూ బెల్లంకొండ సురేశ్ 2018లో రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మరో సినిమా అంటూ మరోసారి రూ.35 లక్షలు తీసుకున్నాడని శరణ్ ఆరోపించాడు. ఇలా తన దగ్గర నుంచి మొత్తంగా రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి చెల్లించలేదంటూ శరణ్ నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దర్యాప్తు జరపాలని ఆదేశించడంతో పోలీసులు నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు.