విక్ట‌రీ త‌ర్వాత ఢిల్లీకి మాన్‌.. ఆత్మీయ‌ ఆలింగ‌నంతో కేజ్రీ వెల్‌క‌మ్‌

  • పంజాబ్‌లో ఆప్ గ్రాండ్ విక్ట‌రీ
  • విజ‌యంతో ఢిల్లీ వెళ్లిన భ‌గ‌వంత్ మాన్‌
  • గుండెల‌కు హ‌త్తుకుని ఆహ్వానం ప‌లికిన కేజ్రీ
  • త‌న త‌మ్ముడు వ‌చ్చాడ‌ని వ్యాఖ్య‌
సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) దేశ రాజ‌దాని ఢిల్లీలో జెండా ఎగుర‌వేసిన త‌ర్వాత ఇప్పుడు పంజాబ్‌లోనూ అధికారం చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నికల ఫ‌లితాలు గురువారం వెలువ‌డ‌గా... ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు అటు పంజాబ్‌ను చేజిక్కించుకునేందుకు య‌త్నించిన బీజేపీని చిత్తు చేసిన ఆప్ గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో ఏకంగా 92 సీట్ల‌ను గెలుచుకుని రాజ‌కీయ విశ్లేష‌కుల‌తో ఔరా అనిపించింది. 

5 రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కొత్త పంథాను అవ‌లంబించిన ఆప్‌.. ఆయా రాష్ట్రాల్లో సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో మీరే నిర్ణ‌యించుకోండి అంటూ పోల్ పెట్టింది. ఈ పోల్‌లో పంజాబ్ ఆప్ సీఎం అభ్య‌ర్థిగా భ‌గ‌వంత్ సింగ్ మాన్ ఎంపిక‌య్యారు. చివరికి ఎన్నికల్లో త‌న పార్టీ అభ్య‌ర్థుల‌తో క‌లిసి మాన్ స‌త్తా చాటారు. గురువారం ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కాగా.. శుక్ర‌వారం మాన్ నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆప్ కార్యాల‌యంలో ఆయ‌న పార్టీ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రివాల్‌ను క‌లిశారు. పంజాబ్‌లో విక్ట‌రీ కొట్టి వ‌చ్చిన మాన్‌ను కేజ్రీ ఆత్మీయ ఆలింగ‌నం చేసుకుని, త‌న త‌మ్ముడు వ‌చ్చాడంటూ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు.


More Telugu News