సుమతీ శతకం, పెద్ద బాలశిక్ష ప్రస్తావన తప్ప బడ్జెట్ లో ఏమీ లేదు: సోమిరెడ్డి
- అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ప్రకటన
- రైతు కుటుంబాల్లో వృద్ధి కనిపించడంలేదన్న సోమిరెడ్డి
- సాగులో రాష్ట్రం ఎలా నెంబర్ వన్ అయిందని ఆశ్చర్యం
- సాగుకు రూ.1.10 లక్షల కోట్లు పచ్చి అబద్ధమని వ్యాఖ్య
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ఇవాళ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ బడ్జెట్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెదవి విరిచారు. సుమతీ శతకం, పెద్ద బాలశిక్ష ప్రస్తావన తప్ప బడ్జెట్ లో ఏమీ లేదన్నారు.
రాష్ట్రం సాగులో దేశంలోనే నెంబర్ వన్ ఎలా అయ్యిందో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబాల్లో మాత్రం ఎక్కడా వృద్ధి కనిపించడంలేదని అభిప్రాయపడ్డారు. సాగుకు రూ.1.10 లక్షల కోట్లు ఖర్చుచేశామని చెబుతున్నారని, ఇది పచ్చి అబద్ధం అని సోమిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం అమ్ముకునేందుకు కూడా దిక్కులేదని వ్యాఖ్యానించారు.