లీటర్ పెట్రోల్ రూ.254, లీటర్ డీజిల్ రూ.214.. ఎక్కడో తెలుసా?
- పెట్రోల్‌పై ఒకేసారి రూ.50 పెంపు
- డీజిల్‌పై అంతకుమించి రూ.75 పెంపు
- లంక ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ నిర్ణయం
- రెండింటి ధరలు డబుల్ సెంచరీ దాటేసిన వైనం
పెట్రోల్, డీజిల్ ధర ఏకంగా డబుల్ సెంచరీ దాటిపోయిందేమిటా? అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ధరలు మన దేశంలోని ధరలు కాదు. భారత్ పొరుగు దేశం శ్రీలంకలో ఈ ధరలు ప్రస్తుతం అక్కడి జనాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పెట్రోల్‌పై ఒకేసారి ఏకంగా లీటరుకు రూ.50 పెరిగితే.. డీజిల్‌కు ఏకంగా రూ.75 పెరిగింది. దీంతో వీటి ధరలు వరుసగా రూ.254, రూ.214కు పెరిగాయి.
శ్రీలంకలో ఈ తరహాలో చమురు ధరలు భారీగా పెరగడానికి కారణం ఉక్రెయిన్, రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధమే కారణమట. యుద్ధం కారణంగా శ్రీలంక సహా చాలా దేశాలకు చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. అంతేకాకుండా శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా భారీ కుదుపునకు గురైందని, ఫలితంగా డాలర్‌తో ఆ దేశ రూపాయి విలువ భారీగా పడిపోయిందని తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీలంకలో ఆయిల్ విక్రయాలను పర్యవేక్షిస్తున్న లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఎల్ఐఓసీ)కి లంక ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందవట. ఈ కారణంగానే ఒక్క నెలలోనే లంకలో మూడు పర్యాయాలు చమురు ధరలు పెరిగాయి.