బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసేలా ఉన్నారు: సోము వీర్రాజు
- బడ్జెట్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ఏ ప్రాంత అభివృద్ధి గురించి ప్రస్తావించలేదన్న సోము
- మసిపూసి మారేడుకాయ చేసే బడ్జెట్ అని విమర్శలు
- అప్పులెన్నో చెప్పాలని వీర్రాజు డిమాండ్
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బడ్జెట్ లో ఏ ప్రాంత అభివృద్ధి గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ను ప్రశ్నించిన సీఎం జగన్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రాంతాల వారీగా ఎందుకు చూపలేదని నిలదీశారు. ఇది మసిపూసి మారేడుకాయ చేసే బడ్జెట్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ బడ్జెట్ తీరు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళతారనిపిస్తోందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.5 వేల కోట్లకు చేరిందన్న విషయాన్ని గమనించాలని అన్నారు. అప్పులు చేసి పథకాలకు పంచేసేలా ఉన్నారని ఆరోపించారు. అప్పులు ఎగ్గొట్టడానికే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేసిన అప్పులపై ఎన్నిసార్లు నిలదీసినా ప్రభుత్వం నుంచి స్పందన కరవైందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అప్పులు ప్రజల ముందుంచాలని వీర్రాజు డిమాండ్ చేశారు.