మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
- మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ప్రస్తావన
- రేసులో చాలామంది ఉన్నారన్న సీఎం జగన్
- గెలిచి వస్తే మళ్లీ మంత్రులు మీరేనంటూ వ్యాఖ్యలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ప్రస్తావన తీసుకువచ్చారు. మంత్రి పదవుల రేసులో చాలామంది ఉన్నారని వెల్లడించారు. అయితే, మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన పక్కనబెట్టినట్టు కాదని స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనంటూ వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో లేనివారు పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. ఒకవేళ పదవిని కోల్పోయిన వారికి జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. కాగా, వైసీపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం క్యాబినెట్ విస్తరణపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.