ఎల్ఓసీ సమీపంలో కూలిపోయిన సైనిక హెలికాప్టర్

  • గురెజ్ సెక్టార్లో ప్రమాదం
  • గాయపడిన సైనికుడ్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన హెలికాప్టర్
  • వాతావరణం అనుకూలించక వెనుదిరిగిన వైనం
జమ్ము కశ్మీర్ లోని గురెజ్ సెక్టార్లో నేడు భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది. గురెజ్ ప్రాంతంలో గాయపడిన ఓ సైనికుడ్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన చీతా హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక వెనుదిరిగింది. ఆ తర్వాత కాసేపటికే ఎల్ఓసీ వద్ద ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయింది.

ప్రమాదానికి గల కారణం ఏంటన్నది తెలియరాలేదని సైనికాధికారులు వెల్లడించారు. గురెజ్ సెక్టార్లోని గుజ్రన్ నల్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సహాయక బృందాలు ఘటన స్థలికి పయనమయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ఎవరైనా తప్పించుకున్నారేమో వెదికేందుకు ప్రత్యేక బృందాలు ఏరియల్ సర్వే చేపడుతున్నాయి. 

సైన్యంలో ఎన్నో సంవత్సరాలు సేవలు అందిస్తున్న చీతా, చేతక్ హెలికాప్టర్లను మార్చి కొత్త హెలికాప్టర్లతో భర్తీ చేయాలంటూ గతంలో ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వీటిని నావల్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్ యూహెచ్), రష్యా తయారీ కేఏ 226టీ హెలికాప్టర్లతో భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.


More Telugu News