ఏపీ వ్యవసాయ బడ్జెట్.. హైలైట్స్

  • మొత్తం బడ్జెట్ - రూ. 11,387.69 కోట్లు
  • నీటి పారుదల రంగానికి రూ. 11,450.94 కోట్లు
  • పశు సంవర్ధక శాఖకు రూ. 1,027.82 కోట్లు
ఏపీ అసెంబ్లీలో మంత్రి కురసాల కన్నబాబు 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు.

వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు:
  • మొత్తం బడ్జెట్ - రూ. 11,387.69 కోట్లు
  • మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 614.23 కోట్లు
  • సహకార శాఖకు రూ. 248.45 కోట్లు
  • ఆహారశుద్ధి విభాగానికి రూ. 146.41 కోట్లు
  • ఉద్యాన శాఖకు రూ. 554 కోట్లు
  • ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 421.15 కోట్లు
  • వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 59.91 కోట్లు
  • వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లు
  • పశు సంవర్ధక శాఖకు రూ. 1,027.82 కోట్లు
  • మత్స్య శాఖకు రూ. 337.23 కోట్లు
  • వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ. 5 వేల కోట్లు
  • వైఎస్సార్ జలకళకు రూ. 50 కోట్లు
  • నీటి పారుదల రంగానికి రూ. 11,450.94 కోట్లు


More Telugu News