మాయావతి, అసదుద్దీన్ లకు పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాలి: శివసేన నేత సంజయ్ రౌత్ వ్యంగ్యం
- యూపీలో బీజేపీ అధికారంలో ఉంది
- అయినప్పటికీ ఎస్పీకి 3 రెట్లు అధికంగా సీట్లు
- బీజేపీ గెలుపుకు మాయావతి, అసదుద్దీన్ సహాయపడ్డారన్న రౌత్
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. యూపీలో బీజేపీ అధికారంలో ఉందని, అయినప్పటికీ అఖిలేశ్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల కంటే మూడు రెట్లు ఎక్కువగా సీట్లు సాధించిందని అన్నారు. బీజేపీ గెలుపుకు మాయావతి, అసదుద్దీన్ ఒవైసీ సహాయపడ్డారని ఆరోపించారు. వారిద్దరికీ పద్మ విభూషణ్, భారత రత్న ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు.
బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలిచిందని, దాని పట్ల తామేం బాధపడట్లేదని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అలాగే, గోవాలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఓడిపోయారని గుర్తు చేశారు. ఇక పంజాబ్‌లో బీజేపీ వంటి జాతీయ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఆయన అన్నారు. పంజాబ్‌లో ప్రధాని, కేంద్ర హోం మంత్రి, రక్షణ మంత్రి సహా బీజేపీ దిగ్గజ నేతలు అందరూ ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు.