యశోద ఆసుపత్రికి తెలంగాణ సీఎం కేసీఆర్
- స్వల్ప అస్వస్థతకు గురయిన కేసీఆర్
- సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు
- తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. ఆయనకు వైద్యులు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారని, ఆయన ఎడమ చేయి లాగుతోందని చెబుతున్నారని వైద్యులు తెలిపారు.
కాగా, గతంలోనూ పలుసార్లు కేసీఆర్ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు కేసీఆర్ యాదాద్రిలో పర్యటించాలని అనుకున్నప్పటికీ స్వల్ప అస్వస్థత కారణంగానే ఆయన ఆ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
ఈ నెల 28న యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభం జరగనున్న నేపథ్యంలో మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉంది. పూజలకు కావాల్సిన ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమీక్ష సమావేశం యథావిధిగానే జరుగుతుందని అధికారులు తెలిపారు.