కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నాడు: విజయశాంతి
- ప్రశాంత్ కిశోర్ తో కలసి నిరుద్యోగుల విషయంలో సరికొత్త డ్రామా షూరూ
- కేసీఆర్ సర్కార్ కేవలం 80వేల ఉద్యోగాలతో సరిపెట్టింది
- గతంలో 4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ చెప్పాడు
- ఇప్పుడేమో కేవలం 80 వేల ఉద్యోగాలంటూ ఆటలాడుతున్నాడన్నా విజయశాంతి
ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ముందస్తు ఎన్నికల కోసమే కేసీఆర్ మరోసారి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
''కేసీఆర్ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రశాంత్ కిశోర్ తో కలసి నిరుద్యోగుల విషయంలో సరికొత్త డ్రామా షూరూ చేసిండు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచుస్తున్నారు. కేసీఆర్ సర్కార్ కేవలం 80వేల ఉద్యోగాలతో సరిపెట్టింది.
సీఎం కేసీఆర్ గతంలో 4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడేమో కేవలం 80 వేల ఉద్యోగాలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు ఆందోళనలు చేస్తుంటే చూస్తు ఊరుకున్న సీఎం సారుకి ఇప్పుడే ఉద్యోగాల భర్తీ ఎందుకు గుర్తొచ్చిందంటే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నాడు. వారి ఓట్ల కోసం కొత్త ఉద్యోగాలంటూ కొత్త రాగం పాడుతున్నాడు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉద్యోగాలంటూ ఆర్భాటం చేస్తున్నాడు.
ఏడాదిన్నర క్రితం 1.91 లక్షల ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికి ఆ ఖాళీలు 3 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు ప్రకటించిన 80 వేల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. 18 వేల మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్.
ఇలాంటి నియంత దేశంలో ఎక్కడా లేరు. ఇన్నాళ్లూ కనీసం టెట్ కూడా నిర్వహించలేదు. కేసీఆర్ కి కాషాయ సెగ తగిలింది. అందుకే పెద్ద దొరవారు దిగి వచ్చారు. దేశంలో బీజేపీ చేసినా అభివృద్ధిని చూసి భయపడి నక్క జిత్తుల వేషాలు వేస్తున్నాడు. నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరడం తట్టుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. కేసీఆర్ నీ నాటకాలను ప్రజలు చూస్తూ ఊరుకోరు. వారే నీకు తగిన సమాధానం చెబుతారు'' అని విజయశాంతి విమర్శలు గుప్పించారు.